యూపీఎస్సీ​ చైర్మన్​గా మనోజ్ ​సోని ప్రమాణం

యూపీఎస్సీ​ చైర్మన్​గా మనోజ్ ​సోని ప్రమాణం


న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్​సర్వీస్​కమిషన్(యూపీఎస్సీ)​ చైర్మన్​గా మనోజ్​ సోని మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీనియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ మెంబర్​ స్మితా నాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్.. మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నోజ్ సోనీతో ప్రమాణం చేయించి న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యావేత్త అయిన సోని.. 2017, జూన్​28న కమిషన్​లో సభ్యుడిగా జాయిన్​అయ్యారు. కాగా, సోని గతేడాది ఏప్రిల్​ 5 నుంచే యూపీఎస్సీ చైర్మన్​ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో సోని వైస్ -చాన్స్​లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. బరోడాలోని సాయాజీరావు వర్సిటీ వీసీగా, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా పనిచేశారు. ఎంఎస్​యూలో వీసీగా చేరిన సమయంలో ఇండియాలోనే అతిచిన్న వయసు వైస్​చాన్స్​లర్​గా గుర్తింపు పొందారు.