ఈ వ్యక్తి స్థానంలో మీరుంటే ఎలా ఆలోచిస్తారు ?

ఈ వ్యక్తి స్థానంలో మీరుంటే ఎలా ఆలోచిస్తారు ?

దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఎన్నో బిల్డింగులు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. ఇలా దెబ్బతిన్న బ్రిడ్జ్ లు, డ్రైనేజీలపై నుంచి వెళితే.. ఇంకేముంది ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి డ్రైనేజీ పైనుండి నడుచుతుంటూ వెళ్తూ.. సెకండ్ తేడాతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇది చూసి షాక్ కు గురయ్యానని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ప్రకారం... ఓ వ్యక్తి మామూలుగా రోడ్డు పక్క నుంచి నడుస్తూ.. ఓ షాప్ లోకి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగనట్టు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలోనే అతడు డ్రైనేజీ పై కప్పుపై కాలు వేయగానే అది షేక్ అవ్వడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. ఆ వ్యక్తి ఒక అడుగు వేసి, మరో అడుగు వేయగానే... డ్రైనేజీ పై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. అప్పటికే ఒక అడుగు వేసి ముందుకు వెళ్లిపోయిన ఆ వ్యక్తి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం జరిగిన విషయాన్ని చూసి.. షాక్ కు గురయ్యాడు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా.. ఆనంద్ మహీంద్రా కూడా షాక్ అయ్యారు. అంతే కాకుండా ఈ వ్యక్తి స్థానంలో మీరుంటే ఎలా ఆలోచిస్తారు  అంటూ ఈ వీడియోను షేర్ చేశారు.