తయారీ బాధ్యత చైనా కంపెనీలకు

తయారీ బాధ్యత చైనా కంపెనీలకు

హైదరాబాద్: పొరుగుదేశం చైనా మార్కెట్‌‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లాబొరేటరీస్‌‌ త్వరలో అక్కడ 70 ప్రొడక్ట్స్‌‌ను విడుదల చేయనుంది. మొత్తం డ్రగ్స్‌‌ను తానే తయారు చేయకుండా, కొన్నింటి మానుఫ్యాక్చరింగ్‌‌ బాధ్యతలను అక్కడి కంపెనీలకు అప్పగిస్తోంది. ఒలాన్‌‌జపీన్‌‌ డ్రగ్‌‌ సప్లై కోసం డాక్టర్‌‌ రెడ్డీస్ ఇది వరకే చైనా నుంచి లైసెన్సు పొందింది. వచ్చే ఏడాది మొదట్లో దీని అమ్మకాలు మొదలుపెడుతోంది. ష్రిజోఫ్రీనియా, బైపోలార్‌‌ డిసీజ్‌‌ వంటి మానసిక సమస్యల చికిత్సకు దీనిని వాడుతారు.

రాబోయే కొన్నేళ్లలోపు మొత్తం 70 ప్రొడక్ట్స్‌‌ వరకు అమ్ముతామని, ప్రస్తుతం ఎనిమిది డ్రగ్స్‌‌ చైనా మార్కెట్లో అమ్ముతున్నామని కంపెనీ తెలిపింది.   చైనాలోని కేఆర్‌‌ఆర్‌‌పీ ప్లాంటులో కొన్నింటినీ, స్థానిక కంపెనీ ప్లాంట్లలో మరికొన్నింటినీ తయారు చేయిస్తోంది. లోకల్ కంపెనీలకు ఔట్‌‌సోర్సింగ్‌‌ ఇవ్వడం వల్ల డ్రగ్‌‌ టెస్టులు, స్టడీలు చేసే ఇబ్బందితప్పుతుందని డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం