తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో

తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో

వర్షాకాలంలో ట్రావెలింగ్‌‌ ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. వర్షపు జల్లుల్లో బైక్‌‌, కార్‌‌‌‌ తీసుకొని నేచర్‌‌‌‌ని ఎంజాయ్‌‌ చేస్తూ లాంగ్‌‌ డ్రైవ్స్‌‌కు వెళ్తుంటారు. అలాంటి వాళ్లకోసం హైదరాబాద్‌‌ నుంచి వన్‌‌స్టాప్‌‌ డెస్టినేషన్‌‌లో కొన్ని ప్లేస్‌‌లు ఉన్నాయి. ఇక్కడికెళ్తే ట్రెక్కింగ్‌‌ చేయడంతో పాటు నేచర్‌‌‌‌ను ఎంజాయ్‌‌ చేయడంతోపాటు తెలంగాణ హిస్టరీని కూడా తెలుసుకోవచ్చు.

యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌‌‌‌లో ఉంటుంది రాచకొండ కోట. చారిత్రక ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన అంశాలు కట్టడాల రూపంలో ఇప్పటికీ ఈ కొండ మీద కనిపిస్తాయి. వీటిని చూస్తే తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో, ఎంత వైభవమైందో అర్థమవుతుంది. 14వ శతాబ్దంలో కాకతీయులకు సామంత రాజైన రేచర్ల సింగమ నాయకుడు ఈ కోటను నిర్మించాడు. తరువాత బహమనీ రాజులు ఈ కోటను రాజధానిగా చేసుకొని తెలంగాణను ఏలారు. ఎంతో మంది రాజులు ఏలిన ఈ కొండలో ఏ కాలంలో అయినా ఎండిపోని సంకెళ్ల బావి, పద్మవ్యూహాన్ని తలపిస్తూ కొండలోపలికి తీసుకెళ్లే దారులు, ది గ్రేట్‌‌ వాల్‌‌ ఆఫ్​ చైనా గోడలా కోట చుట్టూ ఉన్న 40 కిలోమీటర్ల ప్రహారీ, ఇప్పటికీ లోతెంతుందో అంతుచిక్కని లోయ, రాతితో నిర్మించిన సిగ్నల్ పాయింట్స్‌‌, ఆదిమానవులు ఇక్కడ నివసించారని చెప్పే గుహలు, వాటిలో ఉండే ఆర్ట్‌‌ ఇలా ఒక్కటేమిటి అప్పటి సాంకేతిక నైపుణ్యాలను చెప్పే నిర్మాణాలు చాలానే చూడొచ్చు. ఈ కోట హైదరాబాద్‌‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రకృతిని ఇష్టపడేవాళ్లకోసం

ప్రకృతి ప్రేమికుల కోసం టూరిస్ట్‌‌ అట్రాక్షన్‌‌ అయింది తెలంగాణ ఊటీగా పేరుపొందిన అనంతగిరి హిల్స్‌‌. వికారాబాద్‌‌ జిల్లా  అనంతగిరిలో ఉంటాయి ఈ కొండలు. దట్టమైన అడవి మధ్యలో వంపులు తిరిగిన రోడ్డులో వికారాబాద్ అడవులగుండా ఇక్కడికి చేరుకోవాలి. పక్షుల కిలకిల రావాలు వింటూ, స్వచ్ఛమైన గాలి పీలుస్తూ అడవిలో ట్రెక్కింగ్‌‌ చేస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఎటుచూసినా పచ్చని కొండలు, వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు మనసుకు హాయినిస్తాయి. ఇక్కడికి వెళ్తే వీటితో పాటు మూసీ నది జన్మ స్థలం, అనంతపద్మనాభ స్వామి ఆలయం, కోట పల్లి రిజర్వాయర్‌‌‌‌ కూడా చూడొచ్చు. వీకెండ్‌‌లో మంచి ట్రిప్ ప్లాన్ చేసి, ఫ్రెండ్స్‌‌తో ట్రెక్కింగ్‌‌, క్యాంపింగ్‌‌ చేయడానికి మంచి ప్లేస్ ఇది. హైదరాబాద్‌‌ నుంచి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవాలి.

క్వారీ.. షూటింగ్‌‌ స్పాట్‌‌గా...

హైదరాబాద్‌‌, రాజేంద్రనగర్‌‌‌‌లో ఉన్న మానస హిల్స్‌‌ ఇప్పుడు బెస్ట్‌‌ షూటింగ్‌‌ స్పాట్‌‌గా మారింది. నిజానికి ఇది ఒక గ్రానైట్‌‌ క్వారీ. రెండు పక్కల ఉండే కొండలు, దాంట్లో వంపులు తిరిగిన దారులు, క్వారీ గుంతల్లో నిలిచిన నీళ్లు చెరువును తలపిస్తాయి. వీటిని చూస్తే ఏదో లోయలో ఉన్న ఫీలింగ్‌‌ కలుగుతుంది. కొండల మధ్యనుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి ఇక్కడికి వస్తుంటారు చాలామంది. షూటింగ్‌‌ స్పాట్‌‌గా మారిన మానస హిల్స్‌‌కి యువతతో పాటు, వెడ్డింగ్‌‌ ఫొటో షూట్స్‌‌, కేజీఎఫ్​తో పాటు మరెన్నో సినిమా షూటింగ్స్​ ఇక్కడ జరిగాయి. ఫొటో గ్రఫీని ఇష్టపడే వాళ్లకు దగ్గర్లో ఒక మంచి డెస్టినేషన్‌‌ ఈ స్పాట్‌‌. 

ట్రెక్కింగ్‌‌కి కేరాఫ్‌‌

భువనగిరిలో ఉండే భువనగిరి కోట ట్రెక్కింగ్‌‌కి కేరాఫ్‌‌గా మారింది. 610 మీటర్ల ఎత్తు, 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ కొండ ఎక్కుతూ ట్రెక్కింగ్‌‌ చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి చాలామంది వస్తుంటారు . కొండ పైన ఉండే కోటను 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్య కట్టించాడు. హైదరాబాద్‌‌కు 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతిపై కట్టిన ఈ పాత కోట అనేక పోరాటాలకు, చరిత్రకు సాక్ష్యంగా ఇంకా చెక్కుచెదరని నిర్మాణంగా నిలుస్తోంది. వీటితోపాటు రహస్య సొరంగ మార్గాలు కూడా చూడొచ్చు ఇక్కడ.