రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్రు: సండ్ర వెంకట వీరయ్య

రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్రు: సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి, వెలుగు: కొత్తగా నిర్మిస్తున్న100 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా సత్తుపల్లికి నర్సింగ్ కాలేజీ మంజూరు చేయించినట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. మంగళవారం ఆయన క్యాంప్​ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కేవలం అనుమతులతో చేతులు దులుపుకోకుండా సత్తుపల్లికి పాలిటెక్నిక్ కాలేజీ తెచ్చానని, అక్టోబరు నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సింగరేణి భూనిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఎంతో, ప్రస్తుతం ఇస్తున్న పరిహారం ఎంతో ప్రజలే గమనించాలన్నారు. 

ALSO READ :నర్సాపూర్​ గర్ల్స్ హాస్టల్​లో కనీస వసతుల్లేవ్​: మురళి యాదవ్

కొందరు లీడర్లు అవగాహన లేకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, సత్తుపల్లిలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోవడం దారుణమని పరోక్షంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది డిసెంబర్ వరకు పొగిడినవారు, ఇప్పుడు విమర్శించడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో సత్తుపల్లి, పెనుబల్లి ఎంపీపీలు దొడ్డ హేమావతి, లక్కినేని అలేఖ్య, ఆత్మ కమిటీ చైర్మన్ వనమ వాసుదేవరావు, జడ్పీటీసీ రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుల్ల కృష్ణయ్య, నాయకులు రఫీ, అంకమ్మరాజు, మధు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.