తెలంగాణలో భూ రికార్డులకు సంబంధించి కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హయాంలో భూసంస్కరణలు తెచ్చిందని.. నక్సలైట్ లతో చర్చలు జరిపి, వారు లేవనెత్తిన 93 అంశాలను కాంగ్రెస్ పరిష్కరించిందన్నారు. భూ పోరాటాలు వచ్చినప్పుడు చట్టాలు తెచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి హక్కులు కల్పించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని.. గత చట్టాలను వెనక్కి నెట్టడానికే కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నారన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములపై హక్కులు కల్పిస్తే.. కేసీఆర్ ఆ హక్కులను తొలగిస్తున్నారని తెలిపారు.
అందుకే రికార్డుల్లో అనుభవదారు కాలం తొలగించారని.. ప్రశ్నించే వారి గొంతులను పోలీసులను పెట్టి అనగతొక్కుతున్నారన్నారు. కేసీఆర్ కొత్త చట్టం గ్రామాల్లో రక్తపాథానికి దారి తీస్తుందన్న ఆయన.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో భూ సర్వే జరగలేదన్నారు. సర్వేలు చేయకుండా రికార్డుల ప్రక్షాళన వల్త అసైన్డ్ భూములు, ఇనాం భూములు పొందిన వారు హక్కులు కోల్పోతున్నారని తెలిపారు భట్టి విక్రమార్క.

