
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ ను NIA టార్గెట్ చేసింది. గాజర్ల రవి మోస్ట్ వాంటెడ్ అని... ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించింది. గాజర్ల రవి స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. 1992లో నక్సల్స్ ఉద్యమంలో చేరాడు. 2004లో అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాడు. రవిని ఉగ్రవాది అంటూ NIA వేసిన తాజా పోస్టర్లపై మావోయిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది.