Maoist encounter: జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

Maoist encounter: జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..రూ.కోటి రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్​ లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. సోమవారం(సెప్టెంబర్​ 15) ఉదయం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో రూ.1 కోటి రివార్డు కీలక మావోయిస్టు సహదేవ్​ సోరేన్​ తో సహా ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.గోర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవిలో నిషేధిత సిపిఐ (మావోయిస్ట్)కి చెందిన సహ్‌దేవ్ సోరెన్ బృందం, భద్రతా దళం మధ్య ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు.

కొనసాగుతున్న కూంబింగ్..

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు.  సహదేవ్​ సోరేన్​, మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్,జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నక్సల్స్‌ను మట్టుబెట్టి మూడు AK-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో హతమైన వారిలో రూ. కోటి రివార్డు ఉన్న కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరెన్, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హెంబ్రామ్ పై  రూ. 25 లక్షల రివార్డు, జోనల్ కమిటీ సభ్యుడు రూ. 10 లక్షల రివార్డు ఉన్న విర్సేన్ గంజు ఉన్నారు.

 సోమవారం తెల్లవారుజామున హజారీబాగ్‌లోని గోర్హార్ ప్రాంతంలోని పంటిత్రి అడవిలో ఈ ఆపరేషన్ జరిగింది అని CRPF ఓ ప్రకటనలో తెలిపింది.