
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. నారాయణపూర్ లోని దూల్ దగ్గర ఉన్న ఛత్తీస్ గఢ్ ఆర్మ్ డ్ ఫోర్స్ శిబిరంపై దాడికి పాల్పడ్డారు. శిబిరం బయట కాపలా కాస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ సైనికుడు చనిపోయాడు. మిగతా సిబ్బంది అలర్ట్ అయ్యే లోపే మావోయిస్టులు సమీపంలో ఉన్న దట్టమైన అడవిలోకి పారిపోయారు. ఇద్దరు సభ్యులున్న ఓ చిన్న యాక్షన్ టీం ఈ దాడికి పాల్పడి ఉంటుంటుందని ఐజీ సుందర రాజ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతాదళాలు ఆ ప్రాంతంలో కూబింగ్ చేపట్టాయి.