పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారు

V6 Velugu Posted on Oct 25, 2021

ములుగు జిల్లాలోని టేకులగూడ అటవీప్రాంతలో నిన్న(ఆదివారం) జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు.  దీనికి సంబంధించి  ఆయన పేరిట ఒక లేఖ విడుదల అయింది.  ఒక ద్రోహి తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడం కారణంగానే ఎన్ కౌంటర్ జరిగిందని అన్నారు. ఏకపక్షంగా పోలీసులు కాల్పులు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను తెలంగాణ ప్రభుత్వం చంపుతోందని అన్నారు. ఈ భూటకపు ఎన్ కౌంటర్లకు నిరసగా ఈ నెల 27న బంద్ కు పిలుపు నిచ్చింది మావోయిస్టు పార్టీ.

తెలంగాణ లో ఎన్ కౌంటర్ లు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. భూటకపు ఏన్ కౌంటర్ లతో రక్తపు టేరులు పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. నియంత్రుత్వ పాలనను సాగిస్తున్న కేసీఆర్..ఉద్యమకారుల పై అణిచి వేత కొనసాగిస్తున్నారని విమర్శించారు.


నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించారని జగన్ తెలిపారు.

Tagged Maoist leader, Jagan, police opened fire, unilaterally

Latest Videos

Subscribe Now

More News