
మంత్రి సీతక్కకు ఇటీవల తమ పార్టీ పేరుతో వచ్చిన బెదిరింపు లేఖపై మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది. సీతక్కకు వచ్చిన బెదిరింపు లేఖతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. సీతక్కకు మావోయిస్టు పార్టీ ఎలాంటి బెదిరింపు లేఖ పంపలేదని స్పష్టం చేశారు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్. జూన్ 26న మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో సీతక్కకు వచ్చిన లేఖతో తమకు సంబంధం లేదన్నారు.
తెలంగాణలో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై జరుపుతోన్న పాశవిక చర్యను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినా ఆదివాసులను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాన రాష్ట్ర కార్యదర్శ దామోదర లొంగిపోతున్నట్లు ఇటీవల మీడియాలో వస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ ఖండించింది. దామోదర లొంగిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఇదంతా పోలీసులు చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పారు.
మంత్రి సీతక్కకు జూన్ 26న మావోయిస్టు పార్టీ పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. అయితే ఈ లేఖపై గతంలోనే స్పందించారు సీతక్క. మావోయిస్టు లేఖ బాధాకరమన్న సీతక్క... లేఖ మావోయిస్టులే రాశారా లేక వేరే ఎవరైనా రాశారో తేలాల్సి ఉందని చెప్పారు. ఈ క్రమంలో జూలై 5న మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది.