టీఎన్జీవో అధ్యక్షుడిగా జగదీశ్వర్

టీఎన్జీవో అధ్యక్షుడిగా జగదీశ్వర్
  •     జనరల్ సెక్రటరీగా ముజీబ్
  •     రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన నేతలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయ్స్​ అసోసియేషన్ (టీఎన్జీవో)  కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మారం జగదీశ్వర్, ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం  టీఎన్జీవో రాష్ట్ర సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గచ్చిబౌలి బీటీ ఎన్జీవో సొసైటీ ఆఫీస్ లో జరిగింది. ఎన్నికల అధికారిగా సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా సురేశ్ వ్యవహరించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు రెండే నామినేషన్లు రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారి సుగుణాకర్ రెడ్డి ప్రకటించారు. 

సహా అధ్యక్షుడిగా ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. కేంద్ర సంఘంలో  17 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో సారి అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జగదీశ్వర్, హుస్సేనీలను అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఒక్కోక్కటిగా పరిష్కరిస్తుందని, ఉద్యోగులు ఆందోళన చెందొద్దన్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.