
హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్ ఎన్నికయ్యారు. సోమవారం నాంపల్లి టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్షులు, హైదరాబాద్ సిటీ నేతలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరు నెలలుగా టీఎన్జీవో కేంద్ర సంఘంలో వివాదాలు నెలకొన్నాయి.
గతంలో జీఎస్ ఎన్నిక రూల్ ప్రకారం జరగలేదని పలువురు కోర్టుకు వెళ్లారు. దీంతో ప్రెసిడెంట్ పోస్టు ఖాళీగా ఉంది. వివాదం సెటిల్ చేసుకోవాలని మంత్రులు, ప్రభుత్వ పెద్దలు యూనియన్ నేతలకు సూచించారు. దీంతో కోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తున్నది. జగదీశ్వర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర సంఘం నేతలకు, కృతజ్ఞతలు తెలిపారు.