563 గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

 563 గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

563 గ్రూప్-1 ఉద్యోగాల దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2.7 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల సవరణకు ఈ నెల 23 నుంచి 27 వరకు అవకాశం ఉంటుంది. గతంలో రెండు సార్లు రద్దయిన నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మరోసారి అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. 

జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.  కాగా గత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. 563 పోస్టులతో  టీఎస్‌పీఎస్‌సీ  గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 అభ్యర్థులకు మొదట ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రిలిమ్స్‌లో విజయం సాధించి, నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఇందులోనూ నిర్దేశిత మార్కులు సాధించిన అభ్యర్థులకు మార్కుల ఆధారంగా తుది జాబితా విడుదల చేసి ఉద్యోగ నియామకాలు ఖరారు చేస్తారు.