వైద్యారోగ్య శాఖలో 4,356 పోస్టులు ఆర్థిక శాఖ పచ్చజెండా

వైద్యారోగ్య శాఖలో 4,356 పోస్టులు ఆర్థిక శాఖ పచ్చజెండా

తెలంగాణ రాష్ట్రం వైద్య శాఖలో ఖాళీలను భర్తీకి చేయడానికి ఆర్థిక శాఖ అనుమతిస్తూ మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబరు నుంచి ఖాళీగా ఉన్న 4,356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశాక.. వాటిలో బోధనా సిబ్బందిని నిమించేందుకు రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. 

మెడికల్ కాలేజ్ ల్లోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెండ్లు అన్ని కలిపి 4,356 పోస్టులకు త్వరలో భర్తీ చేయనున్నారు. 3,155 పోస్టులు కాంట్రాక్ట్, 1,201 మందిని గౌరవ వేతనంతో భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినట్లు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు. అందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 1,201 ఉన్నాయి. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సత్వరమే నియామకాలు చేపట్టాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.