ఫిబ్రవరిలో మర్దానీ3.. రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్

ఫిబ్రవరిలో మర్దానీ3.. రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ లీడ్ రోల్‌లో నటించిన ‘మర్దానీ’ ఫ్రాంచైజీకి హిందీలో మంచి సక్సెస్ ట్రాక్ ఉంది. గత  పదేళ్లలో వచ్చిన రెండు సీజన్లకు ఆడియెన్స్‌ నుంచి  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలోనే ఏకైక లేడీ కాప్ ఫ్రాంచైజీగా మర్దానీ రికార్డులు క్రియేట్ చేసింది. నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని ‘మర్దానీ 3’లో చూపించబోతోన్నట్టుగా మేకర్స్ తెలియజేశారు.

డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ  మరోసారి కనిపించబోతోన్నారు.  మహిషాసురుడిని చంపినప్పుడు దుర్గా మాత శక్తిని తెలిపే ‘అయిగిరి నందిని’ శ్లోకంతో రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఓ కేసుని సాల్వ్ చేయడానికి  తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో ఈ పోస్టర్‌‌ ద్వారా రివీల్ చేశారు. అభిరాజ్ మినవాల దర్శకత్వంలో  ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.