ఒక పుస్తకం చాలా నేర్పుతుంది. బుక్స్ చదవడం ఒకెత్తయితే మరొకరి చేత చదివించడం చాలా కష్టం. కానీ ఓ బార్బర్ షాప్ ఓనర్ బుక్స్ పై తనకున్న ఇంట్రెస్ట్ తో షాపును పుస్తకాలతో నింపేశాడు. దాదాపు తన షాపులో 1500ల పుస్తకాలను అందుబాటులో ఉంచాడు. ఎటూ చూసినా బార్బర్ షాప్ లైబ్రరీని తలపిస్తుంది. అంతేగాకుండా ఆ యజమాని తన వద్దకు కటింగ్ కు వచ్చిన వారు ఎవరైనా కనీసం 10 పేజీలు చదివితే 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇంతకీ ఆ షాప్ ఎక్కడుంది అనుకుంటున్నారా? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లామిల్లాపురంలో ఉంది. తనకు పుస్తకాలపై ఉన్న ప్రేమతోనే ఇలా చేస్తున్నట్లు యజమాని మరియప్పన్ చెబుతున్నాడు.

