అపార్ట్మెంట్ ఖాళీ స్థలంలో గంజా సాగు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

 అపార్ట్మెంట్ ఖాళీ స్థలంలో గంజా సాగు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

బషీర్​బాగ్, వెలుగు: అపార్ట్​మెంట్ ఖాళీ స్థలంలో గంజాయి సాగు చేస్తున్న వాచ్​మెన్‏ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‎కు చెందిన కైలాష్ జోషి (45) నారాయణగూడలోని నీరజ్ విల్లా అపార్ట్‌మెంట్‎లో పనిచేస్తున్నాడు. గంజాయి అలవాటు ఉండడంతో సొరకాయ, కాకరకాయ విత్తనాల మధ్య గంజా విత్తనాలు నాటి సాగు చేశాడు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితుడిని అరెస్ట్ చేశారు. 4.2 కేజీల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.     

శామీర్​పేట: ఒడిశా నుంచి గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని శామీర్​పేట పోలీసులు అరెస్టు చేశారు. 42 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నాటక బీదర్​కు చెందిన బెల్లాలే ప్రవీణ్ (31), రహీంపురకు చెందిన అవినాష్ జాదవ్ (22), మంగళహాట్‌కు చెందిన సతీశ్ గా గుర్తించారు.