బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఎలోన్ మస్క్ ప్లేస్ ను అధిగమించి ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.మార్క్ జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 187 బిలియన్ డాలర్లు కాగా.. ఎలాన్ మస్క్ సంపద 181 బిలియన్లుగా ఉన్నది. 2024లో టెస్లా స్టాక్ 34 శాతం తగ్గింది.మెటా ప్లాట్‌ఫారమ్‌ల స్టాక్‌లు 49 శాతం పెరిగాయి.
ఇటీవల మార్చి ప్రారంభంలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న మస్క్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది మాస్క్ సంపద 48.4 బిలియన్ డాలర్లు తగ్గగా.. జుకర్ బర్గ్ సంపద 58.9 డాలర్లకు పెరిగింది. మెటా షేర్లు శుక్రవారం గరిష్ఠానికి చేరాయి. నవంబర్ 16, 2020 తర్వాత బ్లూమ్‌బెర్గ్ సంపన్నుల ర్యాంకింగ్‌లో మొదటి మూడు స్థానాల్లో జుకర్‌బర్గ్ కనిపించడం ఇదే మొదటిసారి.
ప్రపంచ కుబేరుల బ్లూమ్‌బెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎల్‌వీఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిట్ విట్టన్ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ మొదటి స్థానంలో ఉండగా.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి టాప్-100 జాబితాలో 10 మంది భారతీయులకు చోటు దక్కింది. రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉండగా.. అదానీ గ్రూప్స్ చైర్మన్ గౌతమ్ అదానీ 14వ స్థానంలో నిలిచారు. వారితోపాటు 10మందిలో షాపూర్ మిస్త్రీ, శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజిమ్ ప్రేమ్‌జీ, దిలిప్ షాంగ్వీ, రాధాకృష్ణ దమానీ, సైరస్ పూనావాలా, లక్ష్మి మిట్టల్ ఉన్నారు.