లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటున్న ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా లక్ష్మీపురంలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఈఈగా పని చేస్తున్న సిరాజ్ మొహినుద్దీన్.. కొడలి వెంకట శైలేంద్ర బాబు అనే కాంట్రాక్టర్‌ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. 

వివరాల్లోకి వెళితే... మార్చి 15న కాంట్రాక్టర్ శైలేంద్ర బాబు తనకు రావాల్సిన రూ.70 లక్షల బిల్లుల కోసం వెళ్లగా మార్కెట్ ఈఈ రూ.60 వేలు డిమాండ్ చేశాడు. అయితే అంత డబ్బు ఇవ్వలేనని చెప్పిన కాంట్రాక్టర్‌..చివరకు రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డా ఆ కాంట్రాక్టర్‌ అధికారి తీరుపై ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బుధవారం సాయంత్రం సమయంలో ఈఈ.. కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా... ఏసీబీ బృందం పట్టుకుంది. సుమారు 2 గంటల పాటు మార్కెటింగ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.