పెళ్లిళ్ల సీజన్ : జర్బర పూలకు మస్త్ గిరాకీ..

పెళ్లిళ్ల సీజన్ : జర్బర పూలకు మస్త్ గిరాకీ..

వచ్చేదంతా పెళ్లిళ్ల సీజనే. పెళ్లి మండపాలు..రిసెప్షన్ డెకరేషన్లకు ఎన్ని పూలు ఎక్కువగా అలంకరిస్తే అంత లుక్ ఉంటుంది. దీంతో డెకరేషన్ పూలకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా జర్బర పూలు. వీటి అందమే ఓ స్పెషల్. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వీటితో డెకరేషన్ చేయాల్సిందే. ఈ జర్బర పూలను రంగారెడ్డి జిల్లాలోని చన్ వెళ్లిలో దాదాపు 40 నుంచి 50 మంది రైతులు పాలీహౌజ్ లో సాగు చేస్తున్నారు. ఒక్క సారి వేస్తే  దాదాపు 8 సంవత్సరాల వరకు కంటిన్యూగా పూలు పుస్తుండటంతో పాటు మంచి డిమాండ్ ఉండటంతో.. ఈ సాగుపై రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సంవత్సర కాలమంతా వచ్చే ఈ పూలకు ఎండాకాలంలోనే చాలా డిమాండ్ ఉంటుందంటున్నారు రైతులు. సమ్మర్ లో పెళ్లిళ్ల సీజన్ కావడం, ఈ పూలతోనే పందిళ్లను డెకరేషన్ చేస్తుండటంతో గిరాకీ ఎక్కువ అవుతుందంటున్నారు.

అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తగ్గిందంటున్నారు రైతులు. ఫిబ్రవరిలో పెళ్లిలు బాగానే జరిగినా..  జర్బర పూలకు మాత్రం ఆ స్థాయిలో అమ్మకాలు చేయలేకపోయామంటున్నారు.   ఇప్పుడు ఏప్రిల్, మే నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈసారి గిరాకీ ఎలా ఉంటుందో చూడాలంటున్నారు. గతేడాది ఒక్కో ఫ్లవర్ 12 నుంచి 16 రూపాయల వరకు అమ్మామంటున్నారు రైతులు. ఈసారి ఇప్పటి వరకు 8 రూపాయల ధర దాటలేదంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో ఫ్లవర్ నాలుగు రూపాయలకే దొరుకుతుందంటున్నారు. పెళ్లిల్లు సీజన్ మొదలైతే మళ్లీ ధర పెరుగుతుందని అప్పుడే కొంత వరకైనా గిట్టుబాటు ధర వస్తుందంటున్నారు. చన్ వెల్లి గ్రామంలో జర్బర ఫ్లవర్స్ పండిస్తున్న వాళ్లలో ఎక్కవ మంది యువ రైతులే ఉన్నారు. ఇతర వ్యవసాయ సాగుతో పోల్చుకుంటే పాలీహౌజ్ లో లాభాలు ఉండటంతో వీటిని సాగు చేస్తున్నారు.

ఇక్కడ పూలు సాగు చేయడంతో పాటు …  డైరెక్టుగా మార్కెట్ యాక్సిస్ పెట్టుకున్నారు. పెళ్లిళ్ల సీజన్ లోనే ఈ పూలకు డిమాండ్  ఉండటంతో  హైదరాబాద్ తో పాటు ఆంద్రప్రదేశ్, ఢిల్లీ, ముంబాయి వంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్నేళ్లుగా జర్బర పూలకు మంచి డిమాండ్ ఉన్నా… ఈసారి మార్కెట్లో  కొత్తరకం చామంతి పూలు రావడంతో  కొంత డిమాండ్ తగ్గిందంటున్నారు. గత సంవత్సరం ఒక్క పాలీ హౌజ్ లో సాగు చేసిన ఫ్లవర్స్ అమ్మకాలతో నెలకు 50వేలు వచ్చాయని, ఈసారి  ఆ పరిస్థితి లేదంటున్నారు.  పాలీహౌజ్ సాగుకు మొదట్లో సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం.. ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ఇతర సాగులతో పోల్చుకుంటే… పాలీహౌజ్ లో గిట్టుబాటు ఖాయమంటున్నారు. పాలీహౌజ్ ల విషయంలో రైతులను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.