పెళ్లి వేదికగా మారిన రైతు వేదిక

పెళ్లి వేదికగా మారిన రైతు వేదిక

రైతు వేదిక పెళ్లి వేదికగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో రైతు వేదికలో పెండ్లి వేడుక చేసుకున్నారు. ఊరికి చెందిన TRS నాయకుడు తన కొడుకు పెళ్లిని రైతు వేదికపై ఘనంగా నిర్వహించాడు. రైతు వేదికలో వివాహ కార్యక్రమం జరిపించేందుకు అదే ఊరికి చెందిన మరో TRS నాయకుడికి మూడు వేలు ముట్టచెప్పాడు. ఈ ఇష్యూలో వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా... రైతు వేదికలో ప్రైవేట్ కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని చెబుతున్నారు. రైతు వేదికలపై పూర్తి అజమాయిషీ వ్యవసాయ శాఖకే ఉంటుందని.... గ్రామ పంచాయతీకి ఎలాంటి అధికారం ఉండబోదని చెప్పారు.