చోరీ కేసు పెట్టి వేధించిన భర్త.. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య

చోరీ కేసు పెట్టి వేధించిన భర్త.. బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న భార్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది.  అత్తింటి వాళ్లు దొంగతనం కేసు పెట్టారని  బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది వివాహిత.  ఆత్మకూరు ఎస్  మండలం పోలీసులతో తన భర్త చేతులు కలిపి వేధింపులకు గురిచేశారంటూ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను బావిలో నుంచి బయటకు తీశారు. 

 అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపురం మండలం  కంచనపల్లికి చెందిన సంధ్య  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(యం) మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో 2024 ఫిభ్రవరిలో వివాహం అయ్యింది. 

  దొంగతనం చేశావంటూ తన  భర్త కృష్ణ ఆత్మకూర్ స్టేషన్ లో కేసు పెట్టాడని యువతి సూసైడ్ నోట్ లో తెలిపింది.  చోరీ చేసినట్టు ఒప్పుకోవాలని  పోలీసులు తనను  ఒత్తిడి చేసి ఇబ్బందులు పెట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.  తాను తప్పచేయలేదని, కావాలని అత్తింటి వారితో పోలీసులు చేతులు కలిపి ఇబ్బంది పెట్టారని ఆరోపించింది.  తన జీవితాన్ని నాశనం చేసిన తన అత్తామామ,భర్త. వాళ్లకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది సంధ్య. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.