- అదనపు కట్నం కోసం భర్త వేధింపులే కారణం
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఘటన
వర్ధన్నపేట, వెలుగు : అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన రెండేండ్ల కొడుకును నడుముకు కట్టుకొని కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కట్ర్యాలకు చెందిన మేకల లింగాలు చిన్న కుమార్తె కళ్యాణి (30)కి నాలుగేండ్ల కింద స్టేషన్ ఘన్‌పూర్ పట్టణానికి చెందిన కామిండ్ల హరీశ్‌తో వివాహమైంది. మామునూరు ఫోర్త్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హరీశ్ భార్యతో కలిసి రంగశాయిపేటలో ఉంటున్నాడు. వివాహ సమయంలో హరీశ్‌కు కట్నం కింద నగదుతో పాటు ప్లాటు, బంగారం ఇచ్చారు. కాగా, అదనపు కట్నం విషయంలో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం సైతం గొడవ జరగడంతో కళ్యాణి తన రెండేండ్ల కుమారుడు శ్రేయాన్స్‌తో కలిసి బయటకు వెళ్లింది. తర్వాత తన చున్నీతో కొడుకును నడుముకు కట్టుకొని కట్ర్యాల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో దూకింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్ కాల్వలో గాలించగా.. కుమ్మరిగూడెం శివారులో ఇద్దరి
డెడ్‌బాడీలు దొరికాయి.
