
పెళ్లి అనేది ఎలా చేసుకున్నావ్ అనేది దానిపై ఆధార పడి ఉంటుంది. నీ ఇష్టమొచ్చిన పెళ్లి చేసుకుంటే అది అందరికీ ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది బాంబే హైకోర్టు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా.. రెండో పెళ్లి చేసుకుంటే.. రెండో భార్యపై లైంగిక దాడి చేసినట్లు పరిగణించాల్సి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మొదటి పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి.. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే దాన్ని ఆ మహిళపై లైంగిక దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని.. మొదటి పెళ్లి విషయాన్ని రెండో భార్యకు చెప్పకపోవటం కూడా తీవ్ర నేరం అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. అబద్దం చెప్పి రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తిపై.. రెండో భార్య కోర్టులో కేసు వేయటంతో.. ఈ తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.
ALSO READ :ముఖంపై కొట్టి, బ్లేడ్ తో పెదవి కోసి.. 85ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం..
2006 ఫిబ్రవరిలో తన భర్తను కోల్పోయిన ఓ మహిళకు అండగా నిలిచాడు ఆ వ్యక్తి, తన మొదటి భార్యతో సత్సంబంధాలు లేవని, ఆమెకు విడాకులు ఇచ్చానని నమ్మించి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 2014 లో ఆమెను వివాహం చేసుకుని 2016 వరకు కలిసి జీవించాడు. చివరకు ఆమెను విడిచిపెట్టి తన మొదటి భార్య వద్దకు తిరిగి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయినని భావించిన అతని రెండో భార్య కోర్టులో కేసు వేసింది. అయితే ఆ ఎఫ్‌ఐఆర్ ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా కోర్టు ఈ తీర్పును వెలువరించింది.