ఐదు స్టార్టప్‌‌లతో మారుతి ఒప్పందం

ఐదు స్టార్టప్‌‌లతో మారుతి ఒప్పందం

న్యూఢిల్లీ: మొబిలిటీ అండ్‌‌ ఆటోమొబైల్‌‌ ఇన్నోవేషన్ ల్యాబ్‌‌ (మేల్‌‌) ప్రోగ్రామ్‌‌ కోసం ఐదు స్టార్టప్‌‌లను ఎంపిక చేశామని మారుతీ సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది. రవాణా, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రకటించింది. ఆటోమొబైల్‌‌ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా మారడానికి ‘మేల్‌‌’ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి ఆయుకవా అన్నారు.

ఈ స్టార్టప్‌‌లు అందించే టెక్నాలజీతో కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. మూడు నెలల పరీక్షల అనంతరం ఈ కార్యక్రమం కోసం సెన్స్‌‌గిజ్‌‌, జేన్‌‌, ఐడెండిఫై, ఎన్‌‌మొవిల్‌‌, డాక్‌‌ట్రన్‌‌ అనే స్టార్టప్‌‌లను ఎంపిక చేశామని మారుతి తెలిపింది. ఇవి ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ ఆధారిత టెక్నాలజీలను అభివృద్ధి చేస్తాయి.