ఎయిర్ బ్యాగ్స్‌లో లోపం.. 17వేల కార్ల రీకాల్

ఎయిర్ బ్యాగ్స్‌లో లోపం.. 17వేల కార్ల రీకాల్

మారుతి సుజుకీ 17,362 కార్లు రీకాల్ చేసింది. ఆ కార్ల ఎయిర్ బ్యాగ్స్ లో లోపం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆల్టో కే10, ఈకో, బ్రెజా, బలెనో, గ్రాండ్ విటారా, ఎస్ ప్రెసో  మోడల్ కార్లలో కొన్నింటిలో ఎయిర్‌‌బ్యాగ్ కంట్రోలర్‌‌లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో లోపాన్ని సరిచేసి కార్లను కస్టమర్లకు అందిస్తామని ప్రకటించింది. 

2022 డిసెంబర్ 8న తయారైన కార్లలో మాత్రమే ఈ లోపం ఉన్నట్లు మారుతీ సుజుకీ గుర్తించింది. ఈ లోపాన్ని సరిచేయకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌‌బ్యాగ్స్, సీట్ బెల్ట్‌లు పనిచేయకపోవచ్చని చెప్పింది. ఈ తేదీన తయారైన కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు కార్ టెస్టింగ్ పూర్తయ్యేంత వరకు వాటిని నడపొద్దని మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.