స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మద్దతు ఇవ్వడానికి..మారుతి సుజుకి, డీపీఐఐటీ ఒప్పందం

స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మద్దతు ఇవ్వడానికి..మారుతి సుజుకి, డీపీఐఐటీ ఒప్పందం

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీ,  మొబిలిటీ రంగంలో టెక్నాలజీ ఆధారిత సొల్యూషన్లను అభివృద్ధి చేసేలా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు  మద్దతు ఇవ్వడానికి మారుతి సుజుకి ఇండియా బుధవారం డిపార్ట్​మెంట్​ఫర్​ప్రమోషన్​ఆఫ్​ ఇండస్ట్రీ అండ్​ ఇంటర్నల్ ​ట్రేడ్​(డీపీఐఐటీ)తో చేతులు కలిపింది. 'స్టార్టప్ ఇండియా' కార్యక్రమం కింద డీపీఐఐటీ గుర్తించిన స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు మారుతి సుజుకి ఇన్నోవేషన్​ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.  

స్టార్టప్​లు నిపుణుల మార్గదర్శకత్వం, పరిశ్రమ సమాచారం, ఆటో తయారీదారుల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్,  మౌలిక సదుపాయాలకు యాక్సెస్​వంటి ప్రయోజనాలు పొందవచ్చు.  ఇవి తమ సొల్యూషన్లను ప్రదర్శించడానికి ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు  పెట్టుబడిదారులతో కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికను పొందుతాయి.