న్యూఢిల్లీ: దేశమంతటా గత నెలలో వెహికల్స్ హోల్‌సేల్స్ బాగున్నాయి. దాదాపు అన్ని కంపెనీ అమ్మకాలు పెరిగాయి. మనదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) మొత్తం టోకు అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 15 శాతం వృద్ధితో 1,97,471 యూనిట్లకు చేరుకున్నట్లు కంపెనీ శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,72,321 యూనిట్లను డీలర్లకు పంపింది. మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు 9 శాతం వృద్ధి చెంది 1,60,271 యూనిట్లకు చేరుకోగా, ఏడాది క్రితం నెలలో 147,467 యూనిట్లుగా నమోదయ్యాయి.
- ఆల్టో, ఎస్-ప్రెస్సోతో కూడిన మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు ఫిబ్రవరి 2023లో 21,875 యూనిట్ల నుంచి 14,782 యూనిట్లకు తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్ వ్యాగన్ఆర్‌తో సహా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 10 శాతం క్షీణించి 71,627 యూనిట్లకు చేరాయి, ఇది గత ఏడాది నెలలో 79,898 యూనిట్లుగా ఉన్నాయి. బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ విటారా ఎక్స్‌ఎల్6తో సహా యుటిలిటీ వెహికల్స్ గత నెలలో 61,234 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఏడాది క్రితం నెలలో అమ్మిన 33,550 యూనిట్లతో పోలిస్తే 82 శాతం వృద్ధిని సాధించాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో 17,207 యూనిట్ల ఎగుమతులు ఉండగా, గత నెలలో ఎగుమతులు 28,927 యూనిట్లుగా నమోదయ్యాయి.
- హ్యుందాయ్ విక్రయాలు 4.5 శాతం పెరిగి 60,501 యూనిట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2023లో కంపెనీ మొత్తం 57,851 యూనిట్లను విక్రయించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో 47,001 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 50,201 యూనిట్లకు చేరుకుంది. అయితే, ఎగుమతులు 2023 ఫిబ్రవరిలో 10,850 యూనిట్ల నుంచి గత నెలలో 5 శాతం క్షీణించి 10,300 యూనిట్లకు పడిపోయాయని పేర్కొంది.
- టాటా మోటార్స్ మొత్తం హోల్‌సేల్స్ 8 శాతం పెరిగి 86,406 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 79,705 యూనిట్లను విక్రయించింది. మొత్తం దేశీయ విక్రయాలు గత నెలలో 78,006 యూనిట్ల నుంచి 9 శాతం వృద్ధితో 84,834 యూనిట్లుగా నమోదయ్యాయని టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో సహా ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలు 19 శాతం వృద్ధితో 43,140 యూనిట్ల నుంచి 51,321 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తం కమర్షియల్ వెహికల్స్ విక్రయాలు గత నెలలో 4 శాతం క్షీణించి 36,565 యూనిట్ల నుంచి 35,085 యూనిట్లకు తగ్గాయి.
- తమ టోకు విక్రయాలు 6 శాతం పెరిగి 75,935 యూనిట్లకు చేరుకున్నాయని మోటార్ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ శుక్రవారం నివేదించింది. ఐషర్ మోటార్స్‌లో భాగమైన కంపెనీ గత ఏడాది ఇదే నెలలో 71,544 యూనిట్లను పంపింది. దేశీయ విక్రయాలు గత నెలలో 64,436 యూనిట్ల నుంచి 67,922 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇవి 5 శాతం వృద్ధిని నమోదు చేశాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 2023లో ఎగుమతులు 7,108 యూనిట్లతో పోలిస్తే 13 శాతం పెరిగి 8,013 యూనిట్లకు చేరుకున్నాయి.
- ఎంజీ మోటార్ ఇండియా శుక్రవారం రిటైల్ విక్రయాలలో 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరిలో 4,532 యూనిట్లు అమ్మింది. ఈ వాహన తయారీ సంస్థ ఫిబ్రవరి 2023లో 4,193 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2024లో విక్రయించిన మొత్తం యూనిట్లలో దాదాపు 33 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ఉన్నాయని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
- హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మొత్తం అమ్మకాలు ఫిబ్రవరిలో 86 శాతం పెరిగి 4,58,711 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 2,47,195 యూనిట్లను డీలర్లకు పంపింది. దేశీయ టోకు విక్రయాలు గత నెలలో 2,27,084 యూనిట్ల నుంచి 4,13,967 యూనిట్లకు పెరిగాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో ఎగుమతులు 20,111 వెహికల్స్‌తో పోలిస్తే గత నెలలో 44,744 యూనిట్లకు పెరిగాయి.
