ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌కు మేరీ కోమ్

ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌కు మేరీ కోమ్

ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌కు కోసం ఈ రోజు జరిగిన ఫైనల్ ట్రయల్స్‌లో నిఖత్ జరీన్‌ను ఓడించి.. క్వాలిఫైయర్స్‌లో తన చోటు పదిలం చేసుకుంది మేరీ కోమ్. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్‌ను ఒలింపిక్ క్వాలిఫైయర్స్‌కు డైరక్ట్‌గా ఎంపిక చేయడంతో సెంట్రల్‌‌ స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌కు లేఖ రాసింది నిఖత్‌‌. దాంతో వారిద్దరి మథ్య ట్రయల్స్ నిర్వహించాలని బీఎఫ్‌‌ఐ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈ రోజు వారికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఫైనల్ ట్రయల్స్ నిర్వహించింది. ఆ ట్రయల్స్‌లో మేరీ, నిఖత్‌ను 9-1 తేడాతో ఓడించింది. మహిళల బాక్సింగ్ ఒలింపిక్ ట్రయల్స్ ఫైనల్స్‌ 51 కిలోల విభాగంలో జరిగింది. టోక్యో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పోటీ చేయడానికి తనకు అవకాశమివ్వాలని గతంలో జరీన్ డిమాండ్ చేసింది.

శుక్రవారం జరిగిన 51కేజీల ఫస్ట్‌‌ రౌండ్‌‌లో మేరీకోమ్‌‌ కూడా 10–0తో రితు గ్రేవాల్‌‌పై వన్‌‌సైడ్‌‌ విక్టరీ సాధించింది. తెలంగాణ బాక్సర్ నిఖత్‌‌ కూడా 10–0తో నేషనల్‌‌ చాంపియన్‌‌ జ్యోతి గులియాను ఓడించింది. దాంతో ఆరుసార్లు వరల్డ్‌‌ చాంప్‌‌ మేరీ మరియు తెలంగాణ స్టార్‌‌ నిఖత్‌‌ మధ్య ఈ అంతిమ పోరు జరిగింది. ఈ పోరులో కోమ్ పైచేయి సాధించి క్వాలిఫయర్‌కి ఎంపికయింది. ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు టోక్యోలో జరిగే ఒలింపిక్‌‌ క్వాలిఫయర్స్‌‌లో ఇండియా తరఫున మేరీ కోమ్ బరిలోకి దిగుతారు. మహిళ బాక్సర్ల ట్రయల్స్ ఈ రోజుతో ముగిశాయి. పురుషుల ట్రయల్స్ డిసెంబర్ 29 నుండి 30 వరకు జరుగుతాయి.

For More News..

2017లో మోడీతో సత్కారం.. 2019లో రోడ్డు మీద జీవనం

ప్రమాణస్వీకారంలో పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలివ్వండి