
క్రికెట్ లో ఐసీసీ బౌండరీల దగ్గర పట్టే క్యాచ్ ల విషయంలో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) క్రికెట్‌లో కొత్త క్యాచ్ నియమాన్ని తీసుకురాబోతున్నాయి. బ్యాటర్ బంతిని బౌండరీని తరలించే క్రమంలో బౌండరీ దగ్గర ఫీల్డర్లు చేసే విన్యాసాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి. సిక్సులు, ఫోర్లు వెళ్లే బంతిని ఫీల్డర్లు తమ అత్యుత్తమ ఫీల్డింగ్ సామర్ధ్యాలతో అడ్డుకొని అద్భుతమైన క్యాచ్ లు అందుకుంటారు. ఈ క్రమంలో బౌండరీని పదే పదే దాటుతూ ఆ తర్వాత లోపలికి వచ్చి క్యాచ్ అందుకోవడం చూస్తూనే ఉంటాం.
ఇలాంటి క్యాచ్ లతో బ్యాటర్లకు అన్యాయం జరుగడమే కాదు.. వివాదాలకు దారి తీస్తున్నాయి. దీంతో ఈ రూల్ కు చెక్ చెబుతూ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ కీలక ప్రకటన చేసింది. ఈ రూల్ ప్రకారం బౌండరీ లైన్ వెలుపల అనేక సార్లు గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకునే క్యాచ్‌లను నాటౌట్ గా పరిగణించనున్నారు. ఫీల్డర్ బౌండరీ రోప్ దాటి ఉన్నప్పుడు బంతిని ఒక్కసారి మాత్రమే తాకగలడు. మొదటి టచ్ తర్వాత, క్యాచ్ పూర్తి చేయడానికి ఫీల్డర్ ఫీల్డ్ లోపలికి రావాలి. గతంలో ఒక ఫీల్డర్ బౌండరీ దాటి బంతిని గాల్లోకి అనేకసార్లు విసిరేయవచ్చు. పాదాలు బౌండరీ లైన్ తాకకపోతే ఎన్ని సార్లైనా బౌండరీ రోప్ టచ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి మాత్రమే బౌండరీ రోప్ దాటాలి.
►ALSO READ | MLC 2025: డుప్లెసిస్ కెప్టెన్సీ అదుర్స్: చివరి ఓవర్లో 9 పరుగులు.. పార్ట్ టైం బౌలర్ మ్యాజిక్
అదే విధంగా బంతిని ఫీల్డర్ మొదటిసారి బౌండరీ వెలుపల నుంచి తాకిన సమయంలో.. అది క్యాచ్‌గా పరిగణించాలంటే ఆ ఫీల్డర్ తప్పనిసరిగా మైదానం లోపల ల్యాండ్ అవ్వాలి. లేకపోతే తన సహచరుడు క్యాచ్ పూర్తి చేసే ముందు ఫీల్డర్ తిరిగి మైదానంలోకి రాలేకపోతే బౌండరీగా లెక్కిస్తారు.
🚨NEW RULE INTRODUCED IN CRICKET
— Sukalyan Chakraborty (@iamsukalyan_) June 14, 2025
🔴If a fielder touches the ball and goes beyond the boundary, if they want to touch the ball again they have to land back in the field of play.
🔴The standard relay catch are still valid since his final contact with inside the field. pic.twitter.com/jWLzC5UHCb