ఇండియాలో 2 లక్షల కరోనా మరణాలను నివారించొచ్చు

ఇండియాలో 2 లక్షల కరోనా మరణాలను నివారించొచ్చు

ఐహెచ్ఎంఈ స్టడీ వెల్లడి

న్యూఢిల్లీ: మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించడం ద్వారా డిసెంబర్ 1 నాటికి దేశంలో 2 లక్షల మంది మరణాలను నివారించొచ్చని ఓ స్టడీలో తేలింది. ఇండియాలో ప్రజారోగ్యానికి మహమ్మారి పెద్ద ముప్పుగా పరిణమించిందని సదరు స్టడీ పేర్కొంది. వాషింగ్టన్ లోని హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ (ఐహెచ్ఎంఈ) అనే యూనివర్సిటీ ఈ స్టడీని నిర్వహించింది. భారత్ లో కరోనా మరణాలను నివారించొచ్చని ఈ స్టడీ పేర్కొంది. అయితే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవడంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను పాటించాలని సూచించింది.

‘ఇండియాలో మహమ్మారి అంతమవ్వడానికి చాలా సమయం పడుతుంది. పెద్ద మొత్తంలో ప్రజలు కరోనా అనుమానితులుగా ఉన్నారు. మా స్టడీ ప్రకారం అక్కడ భారీ ఎత్తున పాజిటివ్ లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, ప్రజలు పాటించే జాగ్రత్తలను బట్టి భవిష్యత్ ను అంచనా వేయొచ్చు. కరో్నా వ్యాప్తిని అడ్డుకోవాలంటే మాస్కు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ ను పాటించాల్సిందే. ఇండియా కీలక దశలో ఉంది. కొవిడ్ కేర్ అవసరం ఉన్న వారికి ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ అందించలేకపోతే మరిన్ని మరణాలు సంభవిస్తాయి. దీర్ఘ కాలంలో ఇది రాష్ట్రాలు, లోకల్ ఎకానమీకి తీవ్ర నష్టం వాటిల్లేలా చేయొచ్చు. రాష్ట్రాల వారీగా కరోనా పరిస్థితులను మానిటర్ చేస్తూ, మాస్క్ వాడకాన్ని ప్రోత్సహించాలి. అవసరమైతే జిల్లాలు లేదా రాష్ట్రాల వారీగా లాక్ డౌన్ విధించాలి. దీని వల్ల ప్రాణాలను కాపాడటమే గాక కరోనా వల్ల ఎకానమీపై పడే ప్రభావాన్నికొంత తగ్గించొచ్చు’ అని సదరు స్టడీ వివరించింది.