బైక్ ప్రచార రథంగా కరోనాపై అవగాహన కల్పిస్తున్న తాపీమేస్త్రీ

బైక్ ప్రచార రథంగా కరోనాపై అవగాహన కల్పిస్తున్న తాపీమేస్త్రీ

లాక్ డౌన్ తో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు రోజు వారీ కూలీలు. అయితే ఓ తాపీ మేస్త్రీ మాత్రం ఇబ్బందులు పడుతున్నా…తన వంతుగా కృషిగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన బాబ్జీ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులన్నీ నిలిచిపోయాయి. అయితే బాబ్జీ మాత్రం తన బైక్ ను కరోనా ప్రచార రథంగా ముస్తాబు చేసి…ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు.

మొదట విశాఖపట్నంలో ఆరు రోజులపాటు ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాడు. జిల్లా కేంద్రం కాకినాడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. లౌక్ డౌన్ సడలించే వరకు కరోనా పై ప్రజలలో అవగాహన కల్పిస్తానని చెప్పాడు బాబ్జి.