Thiruveer Marriage: ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్న హీరో తిరువీర్‌.. ఫొటోస్ వైరల్

Thiruveer Marriage: ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్న హీరో తిరువీర్‌.. ఫొటోస్ వైరల్

మసూద మూవీ హీరో తిరువీర్(Thiruveer) పెళ్లి చేసుకున్నాడు. తాను ప్రేమించిన ఆమ్మాయి కల్పన(Kalpana)తో ఏప్రిల్ 21న వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. ఇరు కుటుంబాల మధ్య ఎంతో ఘనంగా జరిగింది వీరి పెళ్లి. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. పెళ్లి ఫోటోలను నెటిజన్స్ తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవగా.. నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Thiruveer (@thiruveer)

ఇక తిరువీర్ విషయానికి వస్తే.. చిన్నప్పటినుండి ఆయనకీ నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నాటక రంగంలో అడుగుపెట్టాడు తిరువీర్. ఆ తరువాత కొంతకాలం రేడియో జాకీగా చేసిన ఆయన.. బొమ్మలరామారం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అడపాదడపా సినిమాలు చేసినా.. 2022లో వచ్చిన మసూద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తిరువీర్ మోక్షపట్నం, పారాహుషార్  సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.