ఎంత తిరిగినా అవకాశాలు ఇవ్వలేదు

ఎంత తిరిగినా అవకాశాలు ఇవ్వలేదు

తన కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా ఎవరూ అవకాశాలు ఇవ్వనందుకే.. తన సినిమాకి తానే డైరెక్షన్ చేసుకోవాల్సి వచ్చిందని హీరో విశ్వక్ సేన్ అన్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, హిట్ మూవీస్ తర్వాత ఆశించిన స్థాయిలో హిట్ కొట్టలేకపోయిన విశ్వక్ సేన్.. ఇప్పుడు 'దాస్ కా దమ్కీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఒక సాంగ్ మినహా ప్రీ ప్రొడక్షన్ పూర్తై.. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నామన్న విశ్వక్.. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామన్నాడు. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలను మీడియాతో పంచుకున్నాడు.

నాకు కంప్లీట్ క్రెడిట్ రాలేదు

"హోమ్ ప్రొడక్షన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా ఫలక్ నామా దాస్. ప్రజలకు నేనెవరో తెలియకున్న ఆ సినిమాను, అందులో నటించిన నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నా సొంత ప్రొడక్షన్ లో 'దాస్ కా దమ్కీ' వస్తోంది. నేను దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. ఫలక్ నామా దాస్ సినిమాకు నాకు కంప్లీట్ క్రెడిట్ రాలేదు అనుకుంటున్న. ఎందుకంటే అది రిమేక్ సినిమా. కానీ ఇది పూర్తిగా కొత్త స్టోరీ. ఇందులో రావు రమేష్, నివేత పేతురాజ్, రోహిణి, పృద్వీ, ఆది, మహేష్ లు నటిస్తున్నారు. ఇది పూర్తిగా ఇండియన్ సినిమా. రకరకాల కలర్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. థియేటర్ లో ఉన్నంత సేపు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఈ సినిమాను చూడొచ్చు. దీన్ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడలో రూపొందిస్తున్నాం.

యాక్షన్ సినిమాలు జనాలకి బోర్ కొట్టేశాయి
 
'దాస్ కా దమ్కీ' సినిమాలో ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. క్లైమాక్స్ ఫైట్ కోసం బల్గేరియా నుంచి జుజి స్టంట్ మాస్టర్ ని తీసుకొచ్చాం. ఇక ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్, రామక్రిష్ణలు స్టైలిష్ ఫైట్ ను చాలా క్రియేటీవ్ గా షూట్ చేశాము. రామ్ మిర్యాల సాంగ్ ఈ సినిమాకి మరో హైలైట్ గా నిలుస్తుంది. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. దీపావళికి ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తాము. ఫలక్ నామా దాస్ సినిమాకి దీనికీ ఎలాంటి సంబంధం ఉండదు. నేను దర్శకత్వం వహించబోయే సినిమాల్లో హీరో పేరులో దాస్ ఉండేలా చూద్దాం అనుకుంటున్న.. ఫస్ట్ మూవీలో ఫలక్ నామా దాస్ ఇందులో హీరో పేరు క్రిష్ణదాస్. ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉంటాయి. సినిమా ఓపెనింగ్ లో నరేష్ ను డైరెక్టర్ గా అనుకున్నాం. కానీ హెల్త్ ఇష్యూష్ వల్ల తను ముందుకు రాలేకపోయాడు. అందుకే నేనే డైరెక్ట్ చేస్తున్న. ఇక యాక్షన్ సినిమాలు జనాలకి బోర్ కొట్టేశాయి.. అందుకే కొత్తగా ఫైట్స్ ని క్రియేట్ చేశాం. పంచ్ లు కూడా చాలా స్టైల్ గా ఉంటాయి.

ఇప్పుడు నా తీరు మార్చుకున్న
 
నాకు యాక్టింగ్, డైరెక్షన్ రెండు కళ్లు లాంటివి. ఒకదాన్నే ఎంచుకోలేను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక 30, 40 ఏళ్లు అనుభవం తర్వాత దర్శకత్వం చేద్దాం అనుకున్నా. కానీ నా కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా ఎంత తిరిగినా అవకాశం దొరకలేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో నేనే దర్శకత్వం చేసుకోవాల్సి వచ్చింది. ఇక నా సినిమా హిట్ అయినా ప్లాప్ అయిన ఆ క్రెడెట్ అంతా నాదే. మా ప్రొడక్షన్ నుంచి కొత్త హీరోలకు కూడా అవకాశం ఇస్తాము. ఒక ప్రొడ్యూసర్ గా కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాను. నేను పడిన కష్టాలు వేరేవాళ్లు పడకూడదు అనుకుంటున్నాను. నేను ఒక జానర్ కి స్ట్రక్ అయిపోయి ఉండే.. ఇప్పుడు నా తీరు మార్చుకున్న. ఇది పాన్ ఇండియా సినిమా అని నేను చెప్పను. మంచి కంటెంట్ ఉంటే.. దాన్ని జనాలే తీసుకెళ్తారు. నా సినిమ చేసేటప్పడు వేరే ప్రొడ్యూసర్స్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే వేరే సినిమాలు చేయట్లేదు. ఇది పూర్తయ్యాక వేరే సినిమాలు కూడా చేస్తాను" అని విశ్వక్ తెలిపాడు.