అవయవదానం చేస్తే జైలు శిక్ష తగ్గింపు!

అవయవదానం చేస్తే జైలు శిక్ష తగ్గింపు!

బోస్టన్: ఖైదీలు ఆర్గాన్ డొనేషన్ లేదా ఎముక మజ్జ దానం చేస్తే 60 రోజుల నుంచి ఏడాది పాటు జైలు శిక్ష తగ్గిస్తామంటూ అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్ర ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు కార్లోస్ గోంజాలెజ్ ప్రవేశపెట్టిన బిల్లుపై దుమారం రేగింది. ఇది క్విడ్ ప్రో కో మాదిరిగా ఉందంటూ సభలో ప్రతిపక్ష సభ్యులతో పాటు బయట లాయర్లు, ప్రజా సంఘాల నాయకులు సైతం మండిపడుతున్నారు. స్వచ్ఛందంగా ఆర్గాన్స్ డొనేట్ చేసే హక్కు ఖైదీలకు ఉన్నప్పటికీ, ప్రోత్సాహకం పేరిట శిక్షను తగ్గించడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, ఆర్గాన్ డొనేషన్ చేసే ఖైదీలు ముందుగా హాస్పిటల్స్ లో అనేక సార్లు చెకప్ లకు వెళ్లాల్సి ఉంటుందని, అలా ఖైదీలను హాస్పిటల్స్ కు తీసుకెళ్లడం పోలీసులకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అవుతుందని చెప్తున్నారు. దీంతో బిల్లుపై అధికార పక్షం వెనక్కి తగ్గింది. శిక్షకు సంబంధించి బిల్లులో పేర్కొన్న పదాలను మారుస్తామంటూ కార్లోస్ గోంజాలెజ్ ప్రకటించారు.