
బషీర్‌బాగ్, వెలుగు: ఈ నెల 16న కృష్ణాష్టమి ఉత్సవాలకు అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్కాన్ప్రతినిధులు వరద కృష్ణదాస్, శంభువైష్ణవి తెలిపారు. శుక్రవారం ఆలయంలో మాట్లాడారు. వేడుకలకు లక్షా 50 వేల భక్తులు వస్తారని వెల్లడించారు. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలుంటాయన్నారు.
తెల్లాపూర్‌లో 5,252 నైవేధ్యాలు..
ఇస్కాన్సీడీఈసీ ఆధ్వర్యంలో శనివారం తెల్లాపూర్‌లోని పీఎంజీ ఫామ్‌హౌస్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. శ్రీకృష్ణుడికి 5,252 నైవేధ్యాలు సమర్పించనున్నట్లు తెలిపారు. నైవేద్యం తీసుకువచ్చిన భక్తులకు ప్రతిగా మహా ప్రసాదం అందజేస్తామన్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఆటపాటలు, కలరింగ్, ఫ్యాన్సీ డ్రెస్, శ్లోక పఠనం, సాయంత్రం 5:30 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు, రాత్రి 8 గంటలకు కథా-కీర్తన, 9 గంటలకు మహాభిషేకం, 10 గంటలకు ప్రత్యేక దర్శనం, 12 గంటలకు మహాప్రసాదం పంపిణీ చేస్తామని వివరించారు.