అమృత్ సర్ -ఢిల్లీ ..రైల్వే ట్రాక్ పై భారీ పేలుడు

అమృత్ సర్ -ఢిల్లీ ..రైల్వే ట్రాక్ పై భారీ పేలుడు

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. అమృత్ సర్ - ఢిల్లీ రూట్ లో  సిర్హింద్ రైల్వే స్టేషన్  సమీపంలోని  రైల్వే ట్రాక్ పై  పేలుడు సంభవించింది.   సరుకు రవాణా కోసం కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ పై గూడ్స్ రైలు వెళ్తుండగా  జనవరి 23న రాత్రి 11 గంటల సమయంలో  ఈ ఘటన జరిగింది.  రైలు ఇంజిన్ ఖాన్పూర్ క్రాసింగ్ సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో రైల్వే ట్రాక్ 10 అడుగుల ఎత్తు వరకు ఎగిరిపడింది.  ఈ ఘటనలో  గూడ్స్ రైలు ఇంజిన్ దెబ్బతినగా.. లోకో పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

లైల్వే ట్రాక్ పేలడంతో  పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే  అప్రమత్తమైన రైల్వే అధికారులు  దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ప్రాంతాన్ని మరమ్మతులు చేపట్టారు .ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పేలుడు జరిగినట్టు ధృవీకరించారు కానీ పేలుడుకు కారణాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.