పటాన్ చెరులో అగ్నిప్రమాదం... శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్ గోదాంలో మంటలు..

పటాన్ చెరులో అగ్నిప్రమాదం... శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్ గోదాంలో మంటలు..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అగ్నిప్రమాదం జరిగింది. వెహికల్ ఫైనాన్స్  గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో టిప్పర్ లారీలు, కార్లు ఆటోలు బైకులు దగ్దమయ్యాయి. మంగళవారం ( మే 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పటాన్ చెరులోని శ్రీరామ్ వెహికల్ ఫైనాన్స్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరు టిప్పర్ లారీలు, సీజ్ చేసిన కార్లు, ఆటోలు, బైకులు దగ్దమయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కాముకోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందని.. ఎట్టకేలకు  రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు ఫైర్ సిబ్బంది. 

అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఎండాకాలంలో  అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని, ప్రికాషన్స్  తీసుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు.