
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లోని ఫ్యామిలీ కోర్టు సమీపంలోని హౌసింగ్ పే అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన సిబ్బంది భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రదేశమంతో దట్టమైన పొగ కమ్మకుంది.
ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని ముంబై పోలీసులు తెలిపారు.
VIDEO: Fire at family court BKC, Bandra East #BKC #Bandra pic.twitter.com/TsaV8SIcPk
— Free Press Journal (@fpjindia) April 13, 2024