ఛత్తీస్ గఢ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (జూన్6) ఉదయం రాయ్ పూర్ లోని బాంబే మార్కెట్ లో ఉన్నసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీసులో అకస్మాత్తుగా మంటల చెలరేగాయి. దీంతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు భయంతో పరుగులు పెట్టారు . సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న పలు కీలక డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయాయి.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంతో బ్యాంకు లావాదేవీలకు సంబందించిన పలు డాక్యుమెంట్లు, రికార్డులు దగ్దమైనట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని బ్యాంకు యాజమాన్య ప్రకటించింది.
