మధ్యప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్  సచివాలయంలో అగ్ని ప్రమాదం

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. స్థానికుల సమచారంలో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  దట్టమైన పొగ కమ్మేయడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ఇబ్బంది పడుతున్నారు. 

ముఖ్యమంత్రి,మంత్రుల కార్యాలయాలు కూడా ఈ వల్లభ్ భవన్లోనే ఉన్నాయి. ఐదో ఫ్లోర్ లో సీఎం ఆఫీస్ ఉంది.  ఈ ప్రమాదంలో పలు కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు సమాచారం.పాత ఫైళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది వివరాలు ఇంకా తెల్వలేదు.