ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న బోగీలు

ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న బోగీలు

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అహ్మద్ నగర్- నారాయణ్ పూర్ స్టేషన్ల మధ్య 8 బోగీలతో ప్రయాణిస్తున్న ఓ డెమోకు చెందిన 4 బోగీల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా సరైన సమయంలో రైలు దిగడంతో.. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ జరిపి అగ్నిప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.