విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ లోని బీఎఫ్ 3లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని మాపక సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్ల తో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలిసిరాలేదు. 

ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదంలో కార్మికులను ఏమైనా గాయపడ్డారా అనే విషయాలు తెలియకపోవడంతో కార్మికులు బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.