విమాన ప్రయాణాలు మస్తు పెరిగినయ్​!

విమాన ప్రయాణాలు మస్తు పెరిగినయ్​!
  • మేలో దాదాపు ఐదు రెట్లు పెరిగిన ట్రాఫిక్​

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇండియన్ ​ఎయిర్​లైన్​ కంపెనీలు కిందటి నెల లోకల్​ రూట్లలో 1.20 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలను అందించాయి. పోయిన ఏడాది మే నెలతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు ఐదు రెట్లు ఎక్కువ.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డేటా ప్రకారం, 2021 మే లో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 21-లక్షలు మాత్రమే!  2022 మేలో దేశీయ విమానాల్లో ప్రయాణించిన మొత్తం 1.20 కోట్ల మందిలో  70 లక్షల మందిని (57.9 శాతం  వాటాతో) మార్కెట్ లీడర్ ఇండిగో రవాణా చేసింది. ముంబైకి చెందిన మరో క్యారియర్ గో ఫస్ట్ 12.76 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి మొత్తం 10.8 శాతం వాటా సాధించింది. టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌లో భాగమైన ఎయిర్ ఇండియా,  విస్తారా  కిందటి నెలలో వరుసగా 8.23 ​​లక్షలు  9.83 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లాయి.