నారాయణపేటలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

నారాయణపేటలో ఘోర ప్రమాదం... లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ( జూన్ 12 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. మక్తల్ మండలం బొందల్ కుంట  జక్లేర్ గ్రామాల సమీపంలో 167 హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

క్షతగాత్రులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో  బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.బస్సు కర్ణాటక శివమొగ్గ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈమధ్య కాలంలో హైవేలపై ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.. గత వారం ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జూన్ 5న తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు బలంగా ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.