
సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని SBI బ్యాంక్ లో భారీ స్కాం జరిగింది. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల 28 లక్షలు కాజేసింది ముఠా. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వంశీకృష్ణ, కాశి రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, SBI డిప్యూటీ మేనేజర్ వినీల్ రోహిత్, క్లర్క్ సుష్మా, అసిస్టెంట్ మేనేజర్ శిరీషని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు.