శ్రీచైతన్య ‘ఇన్ఫినిటీ వన్’ ప్రారంభం

శ్రీచైతన్య  ‘ఇన్ఫినిటీ వన్’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్​కు సంబంధించిన డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ఇన్ఫినిటీ లెర్న్ ‘ఇన్ఫినిటీ వన్’ అనే  ప్రీమియం వ్యక్తిగత 1:1 ఆన్ లైన్ ట్యూషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్టు ప్రకటించింది. సీబీఎస్ ఈ ఫాండేషన్, జేఈఈ, నీట్ విభాగాల్లో  4 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ప్రోగ్రామ్ ను రూపొందించినట్టు తెలిపింది. 

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రత్యేకంగా కేటాయించిన ఉపాధ్యాయులతో క్లాసులను బోధిస్తామని చెప్పింది. ప్రతి విద్యార్థి బలాలను గుర్తించి మెరుగుపర్చిందుకు అనుగుణంగా పాఠాలను చెబుతామని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సీఈఓ సుష్మా బొప్పన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి అనుగుణంగా క్లాసులను బోధిస్తామని వెల్లడించారు.