జోగిపేట బస్టాండ్ లో భారీ చోరీ

జోగిపేట బస్టాండ్ లో భారీ చోరీ
  •       12 తులాల బంగారం, రూ.18 లక్షలు అపహరణ

జోగిపేట, వెలుగు: జోగిపేట బస్టాండ్​లో  గురువారం భారీ చోరి జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. అల్లాదుర్గానికి చెందిన చెగురి లక్ష్మిదేవి  హైదరాబాద్​లో జరిగే మనవడి వివాహానికి  వెళ్లేందుకు బయలుదేరింది. జోగిపేటలో వారి బంధువులను వెంట తీసుకువెళ్లేందుకు బస్టాండులో దిగింది. ఆమె వియ్యపురాలు రావడంతో అందరూ కలసి వెళ్లే క్రమంలో బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె బ్యాగ్​ ఎత్తుకొని పారిపోయాడు.

అందులో 12  తులాల బంగారు నగలు ఉన్నాయి. పెద్దశంకరంపేటలోని బ్యాంకు లాకర్​లో నుంచి నాలుగు రోజుల కింద పెద్దగొలుసు, కంకణాలు, నాను, వంక ఉంగరం, సాదా ఉంగరం, రూ.8 వేల నగదు ఉన్నట్లు పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్​కుమార్​చెప్పారు.