రివ్యూ : మాస్టర్

రివ్యూ : మాస్టర్

రన్ టైమ్ : 2 గంటల 58 నిమిషాలు

నటీనటులు: విజయ్,విజయ్ సేతుపతి,మాళవిక మోహనన్,అర్జున్ దాస్,శంతను

మ్యూజిక్: అనిరుధ్

సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

ఎడిట‌ర్‌ : ఫిలోమిన్ రాజ్

నిర్మాత: గ్లావియర్ బ్రిట్టో

రచన,దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

రిలీజ్ డేట్: జనవరి 13,2021

కథేంటి..?

జేడీ (విజయ్) ఓ కాలేజ్ ప్రొఫెసర్. స్టూడెంట్స్ అంతా అతనికి సపోర్ట్ గా ఉంటారు. మేనజ్ మెంట్ కు అతనంటే పడదు. అయితే మరో పక్క భవాని (విజయ్ సేతుపతి) చిన్నప్పటి నుంచి ఖైదీగా పెరిగి పెద్దయిన తర్వాత దందాలు చేస్తూ చిన్నపిల్లలను ఖైదీలుగా మార్చి మాఫియా నడుపుతుంటాడు. కొన్ని కారణాలతో కాలేజీ వదిలి చిన్న పిల్లల జైలుకు వెళ్లాల్సి వస్తుంది.అక్కడ వాళ్ల పరిస్థితులను చూసి వాళ్లను ఏవిధంగా మార్చాడు. భవాని ఆగడాలను అరికట్టి పిల్లలను ఎలా రక్షించాడనేది స్టోరీ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో విజయ్ ఎప్పటిలాగే తన స్టైల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ విలన్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి ఎక్కువగా రాణించాడు అని చెప్పొచ్చు.తన కొక ఫ్లాష్ బ్యాక్ ,ఇంట్రడక్షన్ అన్నీ బాగా కుదిరాయి. భవానీ పాత్రలో తనదైన మ్యానరిజం తో కుమ్మేసాడు.మాళవిక మోహనన్ కు పెద్దగా స్కోప్ లేదు కానీ అందంతో ఆకట్టుకుంది. మరో ఇంపార్టెంట్ రోల్ అర్జున్ దాస్ ఇంప్రెస్ చేసాడు.

టెక్నికల్ వర్క్:

అనిరుధ్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది.మాస్ సీన్లు ఎలివేట్ చేయడానికి తన నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది.యాక్షన్ సీన్లు అదిరిపోయాయి.ఎడిటింగ్ లో లోపాలున్నాయి, చాలా ల్యాగ్ ఉంది. అందువల్ల సెకండాఫ్ బోర్ కొడుతుంది. డైలాగులు ఫర్వాలేద అన్పించాయి.

విశ్లేషణ:

‘‘మాస్టర్’’ రెగ్యులర్ యాక్షన్ ఎంటర్ టైనర్. కథలో ఏ మాత్రం కొత్తదనంలేదు. కనీసం కథనంలో కూడా ఎలాంటి మెరుపులు చూపించలేకపోయాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.అతని గత చిత్రం ‘‘ఖైదీ’’ ని పటిష్టమైన స్క్రీన్ ప్లే తో చక్కగా రూపొందించిన లోకేష్ ఈ సినిమాను నడిపించడంలో తడబాటు కనిపించింది.విజయ్ స్టైల్ ,స్వాగ్ తో ఎలివేషన్లు ఓకే కానీ అసలైన కథను సరిగా డీల్ చేయడంలో విఫలమయ్యాడు. స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం ఈజీ కాదని మరోసారి రుజువైంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా సెకండాఫ్ బోర్ కొట్టించాడు.హీరో విజయ్ తన పాత సినిమాలలో చేసిన మ్యానరిజమే చేశాడు. ఆ పాత్రను ఎలాంటి కొత్తదనం లేకుండా రాసుకున్నాడు డైరెక్టర్. విజయ్ సేతుపతి పాత్రను మాత్రం బాగా తీర్చిదిద్దాడు. వీళ్లిద్దరి మధ్య సరైన కాన్ ఫ్లిక్ట్ లేకుండా పోయింది. క్లైమాక్స్ లో పోట్లాడిన కానీ అప్పటికే విసుగు పుడుతుంది.  ఓవరాల్ గా ‘‘మాస్టర్’’ ఆశినంత ఆకట్టుకోలేకపోయింది. ఓ మంచి చాన్స్ ను డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నిలబెట్టుకోలేకపోయాడు.

బాటమ్ లైన్: బోరింగ్ మాస్టర్